సంగారెడ్డి జిల్లా పటాన్చెరు గౌతంనగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. బీమ్లానాయక్ అనే వ్యక్తి.. స్థానికంగా ఉన్న ఏషియన్ పెయింట్స్ పరిశ్రమలో హమాలీ కార్మికుడిగా పని చేస్తున్నాడు.
మద్యానికి బానిసై... ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య
హమాలీ పని చేసుకునే ఓ వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. కుటుంబంలో పెరిగిన ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనోవేదనకు గురై.. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో చోటుచేసుకుంది.
hamali suicided due to financial problems in patancheru
మద్యానికి బానిసైన బీమ్లానాయక్.. ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనోవేదనకు గురై.. ఇంట్లో భార్య శాంతాబాయి లేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.