హైదరాబాద్‌లోని బోరబండలో నివాసముంటున్న మహ్మద్ అఫ్జల్... స్థానికంగా ఎస్‌కే ట్రేడర్స్ దుకాణం నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత గుట్కాను తన దుకాణంలో విక్రయిస్తున్నారన్న ఫిర్యాదు వచ్చింది.
గుట్కా విక్రయిస్తున్న దుకాణంపై టాస్క్ ఫోర్స్ దాడి - మహ్మద్ అఫ్జల్ దుకాణంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి
హైదరాబాద్‌లోని బోరబండలో నిషేధిత గుట్కా విక్రయిస్తున్న దుకాణంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఏడు లక్షల రూపాయల విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకున్నారు.
![గుట్కా విక్రయిస్తున్న దుకాణంపై టాస్క్ ఫోర్స్ దాడి gutkha-seized-by-task-force-police-seized-gutkha-in-borabanda-hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8696740-288-8696740-1599367241259.jpg)
నిషేధిత గుట్కా విక్రయిస్తున్న దుకాణంపై టాస్క్ ఫోర్స్ దాడి
దీంతో షాపుపై నిఘా పెట్టిన టాస్కోఫోర్స్ పోలీసులు... దాడి చేసి భారీగా గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. ఏడు లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితుడు అఫ్జల్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:ఈ నెల 12 నుంచి 40 జతల ప్రత్యేక రైళ్లు