కామారెడ్డి జిల్లా పిట్లం మండలం గోద్మేగాం వద్ద రూ.1.10 లక్షల విలువ చేసే గుట్కా తరలిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు రాత్రి వేళలో తనిఖీలు చేపట్టి... గుట్కాని స్వాధీనం చేసుకున్నారు.
రూ.1.10 లక్షల విలువ చేసే గుట్కా పట్టివేత - తెలంగాణ వార్తలు
కామారెడ్డి జిల్లా గోద్మేగాం వద్ద అక్రమంగా తరలిస్తున్న గుట్కాని పోలీసులు సీజ్ చేశారు. రాత్రి వేళ తనిఖీలు చేపట్టి... పక్కా సమాచారంతో పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
![రూ.1.10 లక్షల విలువ చేసే గుట్కా పట్టివేత gutkha seized by police at godmegam village in pitlam mandal kamareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10211819-649-10211819-1610436458631.jpg)
రూ.1.10లక్షల విలువ చేసే గుట్కా పట్టివేత
కర్ణాటక బీదర్ నుంచి బోధన్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:గూడూరులో 252కేజీల గంజాయి స్వాధీనం