హైదరాబాద్ దూల్ పేటలో నిషేధిత గంజాయి విక్రయిస్తున్న వ్యక్తుల ఇంటిపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేశారు. విశాల్‌సింగ్, ధర్మేందర్ ఇద్దరిని అరెస్టు చేశారు, 38.5 కిలోలు ఎండు గంజాయి, నాలుగు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.
దూల్‌పేటలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు.. వెలుగులోకి చీకటి కోణాలు - excise enforcement police arrested gutka dealers
హైదరాబాద్ దూల్ పేటలో నిషేధిత గంజాయి విక్రయిస్తున్న వ్యక్తుల ఇంటిపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేశారు. ఇద్దరికి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అనేక కోణాలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
పక్కా సమాచారంతో దిగువ దూల్‌పేటలో సోదాలు నిర్వహించినట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఈఎస్ అంజిరెడ్డి తెలిపారు. కొత్తగూడెంలోని సమాద్ యాకుబ్ దగ్గర కిలో నాలుగు వేల రూపాయలకు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో కిలో ఆరువేల రూపాయలకు విక్రయిస్తున్నట్లు విచారణలో నిందితులు వెల్లడించినట్లు వివరించారు. దూల్ పేట్‌లో నిందితుల నుంచి కొనుగోలు చేసినవారు పది గ్రాములు.. వంద రూపాయలు చొప్పున విక్రయాలు చేస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు.
ఇవీచూడండి:'ఆ ఎస్సై నమ్మించి గదికి పిలిచాడు.. ఇప్పుడు మోసం చేశాడు'