తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

30 లక్షల విలువైన గుట్కా స్వాధీనం - reddy palem gutka seized news

30 లక్షల విలువైన నిషేధిత గుట్కాలను గుంటూరు వద్ద పోలీసులు స్వాధీనం చేసుకొని.. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కర్ణాటక నుంచి ఏపీలోకి కంటైనర్​ ద్వారా గుట్కాలను తరలించేందుకు నిందితులు ప్రయత్నించారని పోలీసులు వెల్లడించారు.

gutka siezed
30 లక్షల విలువైన గుట్కా స్వాధీనం

By

Published : Sep 1, 2020, 12:14 PM IST

కర్ణాటక నుంచి ఏపీలోకి నిషేధిత గుట్కాలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు 30 లక్షల విలువ చేసే గుట్కాలను స్వాధీనం చేసుకున్నట్లు నల్లపాటు సీఐ వీరస్వామి వెల్లడించారు.

రోజువారి తనిఖీల్లో భాగంగా గుంటూరు రూరల్ మండలం రెడ్డిపాలెం సమీపంలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా గుట్కా పట్టుబడినట్లు వివరించారు. కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్​లోకి వస్తున్న కంటైనర్​లో నిందితులు గుట్కాను తరలిస్తున్నారని తెలిపారు.

ఇదీ చదవండి:తెలంగాణ మద్యం తరలిస్తున్న వాహనం పట్టివేత

ABOUT THE AUTHOR

...view details