మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండ పల్లి క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఆ సమయంలో మూడు కార్లలో అక్రమంగా రవాణా అవుతున్న 10 లక్షల రూపాయల విలువ చేసే 25 బస్తాల గుట్కా, లక్ష రూపాయల నగదు, 5 సెల్ఫోన్లు, ఓ ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
అక్రమంగా తరలిస్తున్న 10 లక్షల విలువ చేసే గుట్కా పట్టివేత - మహబూబాబాద్ జిల్లా వార్తలు
మహబూబాబాద్ జిల్లాలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. 10 లక్షల రూపాయల విలువ చేసే గుట్కాను పట్టుకున్నారు. ఏడుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంకు చెందిన గొలుసు ఉపేందర్, గోవింద వెంకటనారాయణ, నల్గొండ జిల్లా చండూరుకు చెందిన బొమ్మకంటి అంజయ్య, మిర్యాలగూడకు చెందిన ఎలిమి మణికంఠ, మహబూబాబాద్ జిల్లాకు చెందిన వల్లపు సురేష్, తాటికొండ సతీష్, కొండలే హరీష్ అనే ఏడుగురు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి, కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌లో తక్కువ ధరకు గుట్కా ప్యాకెట్లను కొనుగోలు చేసి కార్లలో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
తెల్లవారుజామున అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు సోదాలు నిర్వహించడం జరిగిందని పోలీసులు తెలిపారు.