కర్నాటక నుంచి మిర్యాలగూడకు గుట్కా తరలిస్తున్న వ్యక్తిని మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి సుమారు 19 లక్షల రూపాయలు విలువ చేసే గుట్కా స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న 19 లక్షల విలువైన గుట్కా పట్టివేత - Latest news from Madhapur police
19 లక్షల విలువైన గుట్కాను మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. కర్నాటక నుంచి మిర్యాలగూడకు తరలిస్తున్నట్లు గుర్తించారు.
అక్రమంగా తరలిస్తున్న 19 లక్షల విలువైన గుట్కా పట్టివేత
ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన జానీ బాషా డీసీఎం వ్యాన్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని మరో వ్యక్తి చెప్పడంతో... బాషా కర్నాటక నుంచి 180 బ్యాగుల్లో గుట్కాను మిర్యాలగూడకు తరలిస్తుండగా... టీఎస్‌పీఏ కూడలి వద్ద ఎస్వోటీ పోలీసులు అతన్ని పట్టుకుని గుట్కాతో పాటు అయిదు వేల రూపాయలు, చరవాణి, ఇరవై ఉల్లిపాయల బస్తాలు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి :నిండుకుండలా మారిన దిగువ మానేరు జలాశయం