నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి కడెంకు అక్రమంగా తరలిస్తున్న నిషేధిత తంబాకు, గుట్కా పొట్లాలను మామడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని హీరా పాన్ షాప్ నుంచి మారుతి వ్యాన్‌లో తరలిస్తుండగా మామడ సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు.
అక్రమంగా తరలిస్తున్న నిషేధిత తంబాకు, గుట్కా స్వాధీనం - గుట్కా స్వాధీనం
అక్రమంగా తరలిస్తున్న నిషేధిత తంబాకు, గుట్కా పొట్లాలను నిర్మల్ జిల్లా మామడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మామడ సమీపంలో చేపట్టిన తనిఖీల్లో వీటిని గుర్తించారు. మార్కెట్‌లో వీటి విలువ సుమారు రూ. లక్ష ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
అక్రమంగా తరలిస్తున్న నిషేదిత తంబాకు, గుట్కా స్వాధీనం
తనిఖీలో రూ. 60 వేల విలువైన పొట్లాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ. లక్ష వరకు ఉంటుందని తెలిపారు. గుట్కా తరలిస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి:హజ్ యాత్రకు ప్రభుత్వం సర్వం సిద్దం చేసింది: హోం మంత్రి