కరుడు గట్టిన ఓ అంతర్రాష్ట్ర దొంగను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరుకు చెందిన బండి శివ కుమార్ ద్విచక్ర వాహనాలు, మహిళల మెడలోని బంగారు గొలుసులను దొంగతనం చేసేవాడు. గతంలో ఇతనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 96 కేసులు నమోదయ్యాయి. ఒంగోలు, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోని 11 చైన్ స్నాచింగ్ కేసుల్లో శివ నిందితుడిగా ఉన్నాడు.
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు.. 96 కేసుల్లో నిందితుడు - chain snatcher arrested in guntur news
మహిళల మెడలోని బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర దొంగను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 10 లక్షలకు పైగా విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
వరుస దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
నిందితుడి నుంచి రూ. 10.80 లక్షల విలువైన 225 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి వెల్లడించారు. ఇలాంటి దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బంగారు ఆభరణాలు ధరించే మహిళలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
ఇదీ చదవండి:'అధికారులకు సవాల్‌గా మారిన ఫాక్స్ సాగర్ చెరువు సమస్య'