మూడు బోగస్ సంస్థలు సృష్టించి జీఎస్టీ లబ్ధి పొందేందుకు ప్రయత్నించిన ముగ్గురిని రంగారెడ్డి జిల్లా సీజీఎస్టీ అధికారులు అరెస్టు చేశారు. వ్యాపారం చేయకుండానే రూ.32.54కోట్ల టాక్స్ క్రెడిట్ పొందేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే రూ.19.1కోట్లు రిఫండ్ పొందినట్లు గుర్తించారు.
నకిలీ బిల్లులతో అక్రమాలకు పాల్పడిన ముగ్గురి అరెస్ట్ - తెలంగాణ నేర వార్తలు
బోగస్ సంస్థల పేరుతో నకిలీ బిల్లులు సృష్టించి అక్రమాలకు పాల్పడిన ముగ్గురిని రంగారెడ్డి జిల్లా సీజీఎస్టీ అధికారులు అరెస్టు చేశారు. తప్పుడు ధ్రువ పత్రాలతో రూ.32.54 కోట్లు లబ్ధి పొందేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు.
![నకిలీ బిల్లులతో అక్రమాలకు పాల్పడిన ముగ్గురి అరెస్ట్ నకిలీ బిల్లులతోఅక్రమాలకు పాల్పడిన ముగ్గురి అరెస్ట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10162888-thumbnail-3x2-gst-rk.jpg)
నకిలీ ధ్రువపత్రాలతో జీఎస్టీ రిజిస్ట్రేషన్లు పొందినట్లు రంగారెడ్డి సీజీఎస్టీ కమిషనర్ ఎంఆర్ఆర్ రెడ్డి తెలిపారు. బోగస్ సంస్థల పని పట్టేందుకు దేశ వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగా అనుమానమొచ్చి ఆయా సంస్థలకు సబంధించిన ఈవే బిల్లులను పరిశీలించగా బోగస్ సంస్థలుగా తేలినట్లు వివరించారు. అక్రమాలకు పాల్పడిన బిహర్‌కు చెందిన ముఖేష్ కుమార్, సంజయ్ జోషి, రాహుల్ అగర్వాల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిని నాంపల్లి ఆర్థిక వ్యవహారాల న్యాయస్థానంలో హాజరు పరచగా... 21వరకు రిమాండ్ విధించినట్లు వివరించారు.
ఇదీ చూడండి:ప్రాణం తీసిన వాట్సాప్ ఫొటో