కిరాణా దుకాణంలో నగదు దొంగతనం చేసి పారిపోతున్న చిన్నారులను పట్టుకుని తాడుతో కట్టేశాడో దుకాణ యజమాని. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మద్దులపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన పది నుంచి పన్నెండేళ్ల లోపు పిల్లలు స్థానికంగా ఓ కిరాణా దుకాణంలో కొంత నగదును దొంగిలించి పారిపోతున్నారు. ఆ క్రమంలో వారిని పట్టుకున్న దుకాణ యజమాని పట్టుకున్నాడు. అక్కడే ఉన్న పందిరి గుంజకు వారిని తాడుతో కట్టేశాడు.
చిన్నారులపై దుకాణ యజమాని ప్రతాపం... పందిరి గుంజకు కట్టేసి - భూపాలపల్లి జిల్లా వార్తలు
చిన్న పిల్లలు తప్పు చేస్తే అది తప్పని చెప్పే బాధ్యత పెద్దలదే. కాని పిల్లలు తప్పు చేశారని ఆగ్రహించిన ఓ ప్రబుద్ధుడు అమానవీయంగా ప్రవర్తించాడు. చిన్నారులని కూడా చూడకుండా పందిరి గుంజలకు చేతులు కట్టేసి పాశవిక చర్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మద్దులపల్లిలో జరిగింది.
చిన్నారులపై దుకాణ యజమాని ప్రతాపం... పందిరి గుంజకు కట్టేసి
దీనికి సంబంధించిన దృశ్యాలు స్థానిక సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కొద్ది సేపు అలానే ఉంచి తర్వాత పిల్లలను కుటుంబ సభ్యులకు అప్పగించాడు. అయితే ఆ పిల్లలు ఇది వరకు కూడా అలాగే చేయడం వల్ల వారి కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ చిన్నారులను అలా బంధించడం పట్ల స్థానికంగా చర్చనీయాంశమైంది.