రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో గ్రనేడ్ల కలకలం రేగింది. కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన సంచార జీవులు చింత చెట్టు వద్ద బస చేశారు. కొందరు గ్రామంలో భిక్షాటనకు వెళ్లగా.. వారి పిల్లలు అక్కడే ఉన్న చింతచెట్టు వద్ద ఆడుకుంటున్నారు.
గ్రనేడ్ల కలకలం: ఏ చెట్టు కింద ఏ బాంబు ఉందో! - grenades in sirisilla
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో గ్రనేడ్ల కలకలం రేగింది. ఏన్నో ఏళ్ల క్రితం మావోయిస్టులు చింత చెట్టులో దాచిపెట్టి బాంబులు బయటపడ్డాయి.
గ్రనేడ్ల కలకలం: ఏ చెట్టు కింద ఏ బాంబు ఉందో!
ఈ క్రమంలోనే చింత చెట్టు మొదట్లో రెండు గ్రనేడ్లు బయటపడ్డాయి. ఆట వస్తువులుగా భావించిన పిల్లలు వాటిని పట్టుకోవడానికి వెళ్లారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గ్రామానికి చేరుకొని గ్రనేడ్లను పరిశీలించారు. ఏన్నో ఏళ్ల క్రితం మావోయిస్టులు చింత చెట్టులో దాచిపెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.