తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మందలించడమే నేరమైంది.. రక్తపు మడుగులో తుదిశ్వాస విడిచింది.. - వికారాబాద్​ నేరవార్తలు

మద్యం తాగి చెల్లిలితో గొడవపడుతున్నాడని మందలించిందని.. అమ్మమ్మనే హత్య చేశాడు ఓ మనవడు.. వికారాబాద్​ జిల్లా కొత్తగడిలో ఈ ఘటన జరిగింది.

grandson hits his grand mother
మందలించడమే నేరమైంది.. రక్తపు మడుగులో తుదిశ్వాస విడిచింది

By

Published : Oct 8, 2020, 12:13 AM IST

మందలించడమే ఆమె చేసిన నేరమైంది.. మద్యం మత్తు వదలమని చెప్పడమే.. యమపాశమైంది. మద్యం మత్తులో అమ్మమ్మను బండరాయితో మోదీ చంపిన ఘటన వికారాబాద్​ జిల్లాలో జరిగింది.

వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తగడికి చెందిన నర్సింగ్​.. మద్యానికి బానిసయ్యాడు. బుధవారం సాయంత్రం మద్యం తాగి ఇంటికి వచ్చి.. చెల్లితో గొడవకు దిగాడు. తాగి గొడవ చేస్తావా అంటూ నర్సింగ్​ను.. అతని అమ్మమ్మ బాలమ్మ నిలదీసింది. అదే ఆమెకు చివరి మాటైంది. ఆగ్రహించిన నర్సింగ్​ ఆమెపై బండరాయితో దాడిచేశాడు. రక్తపు మడుగులో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించారు స్థానికులు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మరణించిందని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్​ టీంతో ఆధారాలు సేకరించారు.

మందలించడమే నేరమైంది.. రక్తపు మడుగులో తుదిశ్వాస విడిచింది

ఇవీచూడండి:కన్న కొడుకుని బలికొన్న తల్లి వివాహేతర సంబంధం

ABOUT THE AUTHOR

...view details