తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

గద్వాలలో భారీ చోరీ... 20 తులాల బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు - గద్వాలలో భారీ చోరీ

ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 20 తులాల బంగారు ఆభరణాలు, రూ. 40 వేలు నగదును అపహరించిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జహీరాబేగం ఇంట్లో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

20 tula gold theft to jogulamba district
గద్వాలలో భారీ చోరీ... 20 తులాల బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు

By

Published : Jul 28, 2020, 10:42 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జహీరాబేగం ఇంట్లో 20 తులాల బంగారు ఆభరణాలు, రూ. 40 వేలు నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. సోమవారం మధ్యాహ్నం జహీరాబేగం, ఆమె కూతురు గద్వాల పట్టణంలోని బంధువుల పెళ్లికి వెళ్లారు. ఎవరూ లేకపోవడంతో... ఇంట్లోకి చొరబడి... బీరువా తలుపులను విరగొట్టి సొమ్ము దోచుకెళ్లారు.

బీరువా నుంచి 20 తులాల బంగారు ఆభరణాలు, రూ. 40 వేల సొమ్మును ఎత్తుకెళ్లారు. ఉదయం ఇంటికి వచ్చిన జహీరాబేగం.. చోరీ జరిగినట్లు గ్రహించి పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐ హనుమంతు, ఎస్సై సత్యనారాయణ, క్లూస్ టీం అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ హనుమంతు తెలిపారు.

ఇదీ చూడండి:-మార్స్​ యాత్రకు కౌంట్​డౌన్​- రోవర్​ విశేషాలు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details