జగిత్యాల జిల్లా మల్యాల మండలం గొర్రెగుండంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న కోమలత ఆదివారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అందరు పడుకున్న సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటికుచుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
గొర్రెగుండంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య - Gorgundam Junior Panchayat Secretary commited suicide
జగిత్యాల జిల్లా మల్యాల మండలం గొర్రెగుండంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న కోమలత ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాల వల్లే బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు.
గొర్రెగుండంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య
కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కొంతకాలంగా కుటుంబంలో కలహాలు చోటుచేసుకుంటున్నట్లు.. ఆమె మృతికి అదే కారణమై ఉంటుందని స్థానికులు పోలీసులు తెలిపారు. వివరాలు తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
- ఇదీ చూడండి :రోడ్డుప్రమాదంలో హెటిరో డైరెక్టర్‌కు తీవ్రగాయాలు