ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా ప్రజల నుంచి కిలోకి పైగా బంగారం, కోటికి పైగా నగదుతో ఉడాయించిన గోల్డ్ షాప్ యజమాని ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డి.హిరేహల్ మండలం గొడిశలపల్లిలో శ్రీసాయి జువెలరీ, వర్క్ యజమాని సుదర్శనాచారి 200 మందికి టోకరా వేశారు. కిలో పైగా బంగారం, కోటికి పైగా నగదుతో ఉడాయించాడు. నాలుగు రోజుల కిందట ఊరు విడిచి పరారయ్యాడు.
విషయం తెలుసుకున్న 34 బాధితులు డి.హిరేహాల్ పోలీసు స్టేషన్కు చేరుకుని పిర్యాదు చేశారు. వీరిలో 22 మంది వరకు కిలో పైగా బంగారం కోసం అడ్వాన్స్, రిపేర్లకు బంగారం ఇచ్చిన వారు కాగా, 20 మంది నగదు రూ.51 లక్షలు అప్పు, చే బదుళ్లు ఇచ్చారు. ఇంకా గ్రామంలో మహిళా బాధితులు వంద మందికి పైగా ఉన్నట్లు సమాచారం. అంతా కలసి సుమారు మొత్తం ఒకటిన్నర కోటిరూపాయలు మేర మోసపోయినట్లు తెలియజేశారు.