తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

దృష్టి మరల్చారు.. పదితులాలు పట్టుకెళ్లారు.

హైదరాబాద్​లో దొంగలు రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా నిత్యం చోరీలకు పాల్పడుతున్నారు. ముందుగా.. ఇంట్లో ఒక్కరే ఉన్నారా? వీధిలో ఒంటరిగా వెళ్తున్నారా అనేది గమనిస్తారు. అన్నీ నిర్ధారించుకున్న తర్వాత ఓ పథకం ప్రకారం తెలివిగా మోసగించి దోచుకొని వెళ్లిపోతారు. ఇలాగే ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ మహిళను ఏమార్చి.. పదితులాల బంగారు ఆభరణాలు చోరీ చేసింది ఓ ముఠా. ఈ ఘటన అంబర్‌పేట పరిధిలో చోటుచేసుకుంది.

gold robbery in rtc bus
దృష్టి మరల్చారు.. పదితులాలు పట్టుకెళ్లారు.

By

Published : Dec 27, 2020, 8:37 PM IST

ఆర్టిసీ బస్సులో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళను ఓ ముఠా టార్గెట్ చేసింది. మాటల్లో పెట్టి ఆవిడను ఏమార్చింది. గుడ్డిగా వారిని నమ్మి, అంతా అయ్యాకా మోసపోయానని గ్రహించిన ఆ మహిళ చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించింది.

దుండిగల్‌ జీడిమెట్లకు చెందిన బాలమణి ఓ శుభకార్యం నిమిత్తం దిల్‌సుక్‌నగర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లింది. అనంతరం తిరుగు ప్రయాణంలో బస్సు ఎక్కింది. అదే సీటులో కుర్చున్న మరో మహిళ.. బాధితురాలితో తన డబ్బులు పడిపోయినట్లు తెలిపింది. అలా ఆ మాయలేడికి సాయం చేసే సమయంలో పథకం ప్రకారం ఆమెతో వచ్చిన ముఠా.. బ్యాగ్​లో ఉన్న 10 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేసింది. అనంతరం ఆ మరుసటి స్టాప్​ లో దిగిపోయింది.

కాసేపటికి.. బ్యాగు తెరిచి ఉండటాన్ని గమనించిన బాధితురాలు నగలు చోరీకి గురయ్యాయని గ్రహించింది. చేసేదేమీ లేక స్థానిక పోలీసులకు సమాచారమిచ్చింది. నిందితురాలితో పాటు మరో ముగ్గురు తన వెంట ఉన్నారని పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి:పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో స్టెప్పులేసిన జేసీ

ABOUT THE AUTHOR

...view details