సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు గ్రామంలో జులై 27న భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబానికి కరానా సోకింది. వారంతా చికిత్స నిమిత్తం హైదరాబాద్కి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన ముగ్గురు స్థానికులు... బాధితుల ఇంట్లోని 62 తులాల బంగారు ఆభరణాలు, లక్ష రూపాయల నగదు చోరీ చేశారు.
చోరీ కేసును ఛేదించిన పోలీసులు... 62 తులాల బంగారం స్వాధీనం
కరోనా వచ్చిందని... చికిత్స తీసుకునేందుకు ఓ కుటుంబం ఆస్పత్రికి వెళ్లిన విషయం గమనించారు అదే గ్రామానికి చెందిన వ్యక్తులు. వారి ఇంట్లో నగదు అధిక మొత్తంలో దొరుకుతుందని భావించి... దొంగతనానికి వెల్లారు చేసేందుకు వెళ్లారు. 62 తులాల బంగారు నగలతో పాటు... లక్ష రూపాయల నగదును దొంగలించిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది.
ఘటన స్థలాన్ని పరిశీలించిన స్థానిక పోలీసులు... తెలిసినవారే నేరానికి పాల్పడి ఉంటారనే కోణంలో విచారణ ప్రారంభించారు. అనుమానించినట్లుగానే అదే గ్రామానికి చెందిన వ్యక్తులపై అనుమానించారు. దర్యాప్తు జరిపి చోరీకి పాల్పడిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నగలు స్వాధీనం చేసుకున్నారు. వీరికి సహకరించిన మరో వ్యక్తిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ భాస్కరన్ అభినందించారు.
ఇదీ చూడండి:వేర్వేరు చోరీ కేసుల్లో ముగ్గురు అరెస్ట్.. భారీగా సొత్తు స్వాధీనం