హైదరాబాద్‌లోని వారసిగూడలో ఉంటున్న చంద్రశేఖర్ అనే వ్యక్తి ఇంట్లో గత రెండు రోజుల క్రితం చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజలు క్రితం చంద్రశేఖర్ కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్‌కు వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. వెంటనే ఇంట్లోకి వెళ్లి.. చూసేసరికి అల్మారాలో ఉన్న బంగారం, డబ్బు మాయమయ్యాయి. వారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు.
షాపింగ్ వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల చేసిన దొంగలు - నేర వార్తలు
ఇంట్లో వాళ్లు షాపింగ్‌కి వెళ్లిన సమయాన్ని అదునుగా చేసుకొని గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డ ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగలను వెతికే పనిలో పడ్డారు.
షాపింగ్ వెళ్లొచ్చేసరికి ఇల్లు గుళ్ల చేసిన దొంగలు
13 తులాల బంగారంతో పాటు లక్ష రూపాయల నగదు, 50 తులాల వెండి ఆభరణాలను అపహరించినట్లు ఇంటి యజమాని చంద్రశేఖర్ అల్లుడు ప్రేమ్ తెలిపారు. తమ ఇంట్లో పని చేసేవారు ఇటీవల పని మానేసి వెళ్లిపోయినట్లు చెప్పారు. వారే దొంగతనానికి పాల్పడ్డారని అనుమానం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:వరద బాధితులకు ఆర్థికసాయం ప్రక్రియ ప్రారంభం