తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ప్రేమించాడు.. పెళ్లి అనగానే మొహం చాటేశాడు.. - Manchiryala District Latest News

జీవితాంతం కలిసి ఉందామంటూ కబుర్లు చెప్పాడు.. ప్రేమిస్తున్నానంటూ.. నమ్మబలికాడు.. ఆమె పెళ్లి అనగానే మొహం చాటేశాడు. దీనితో మనస్తాపానికి గురైన ప్రియురాలు... ప్రియుడి ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. పెళ్లి చేసుకోకపోతే.. పురుగుల మందు తాగి చనిపోతానంటూ.. హెచ్చరించింది.

lover protest
ప్రేమించాడు.. పెళ్లి అనగానే మొహం చాటేశాడు..

By

Published : Oct 6, 2020, 2:58 PM IST

మంచిర్యాల జిల్లా జన్నారం గ్రామానికి చెందిన ఓ యువతికి.. వెంకటరావు పేట గ్రామానికి చెందిన అరుణ్​కుమార్​తో గత కొంతకాలం నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో తనకు న్యాయం చేయాలంటూ లలిత... అరుణ్​కుమార్​ ఇంటి ముందు శనివారం బైఠాయించింది.

గత 3 రోజుల నుంచి న్యాయ పోరాటం చేస్తుండగా పోలీసులు, గ్రామస్థులు ప్రియుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం వల్ల నిన్న రాత్రి గొడవ సద్దు మణిగింది. అయినా ఎలాంటి హామీ లభించలేదు. దీంతో బాధితురాలు అబ్బాయి ఇంటి ముందు... ఆత్మహత్య చేసుకుంటానని పురుగుల మందు డబ్బాతో నిరసన చేపట్టింది. న్యాయం చేయాలంటూ ఆమె బంధువులు గ్రామ రహదారిపై ఆందోళనకు దిగారు.

ఇదీ చదవండిఃకూరగాయల మార్కెట్ షెడ్డులో అగ్నిప్రమాదం

ABOUT THE AUTHOR

...view details