ఓ యువతి పెళ్లి విషయం ఆమె నిండు ప్రాణాలు తీసింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని సంజీవన్రావుపేట్కు చెందిన రూప(19) ఇంటర్ పూర్తి చేసింది. ఈ క్రమంలో యువతి తల్లిదండ్రులు వివాహం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఓ సంబంధం గురించి మాట్లాడుతుండగా కట్నం విషయంలో సర్దుబాటు కాలేదని సమాచారం.
ప్రాణం తీసిన పెళ్లి విషయం.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య - sangareddy district news
తల్లిదండ్రులు తన వివాహం కోసం ఇబ్బంది పడుతున్నారని మనస్తాపం చెంది ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా సంజీవన్‌రావుపేట్‌లో చోటుచేసుకుంది. ఆమె మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ప్రాణం తీసిన పెళ్లి విషయం.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య
దీంతో వివాహం కోసం తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని రూప భావించి మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తమతో చెప్పుకోలేక తన మనసులోనే మదనపడిందని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువతి ఇలా చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకోవడం గ్రామస్థులను కలచివేసింది. యువతి మృతితో ఆమె కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చూడండి: సరదాగా ట్రాక్టర్‌పై వెళ్లిన బాలుడు మృత్యు ఒడిలోకి...