మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలో ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. మండలంలోని బుద్దారం గ్రామంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఈ ఏడాది మార్చిలో పదో తరగతి పూర్తి చేయగా.. కరోనా కారణంగా ఇంటి వద్దే ఉంటోంది.
ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య - తెలంగాణ వార్తలు
ఆమె ఈ ఏడాది మార్చిలో పదో తరగతి పూర్తి చేసుకుంది. కరోనా కారణంగా ఇంటి వద్దే ఉంటోంది. ఏం జరిగిందో.. ఏ కష్టం వచ్చిందో ఆ తల్లికి.. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలో చోటుచేసుకుంది.
![ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య girl suicide in mahabubnagar district hanwada mandal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9950337-302-9950337-1608517168576.jpg)
ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య
విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. బాలిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి:అటవీ ప్రాంతంలో లైసెన్స్ తుపాకులతో వేట