పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నవాబ్‌పేట గ్రామంలో తండ్రి మందలించాడని... ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముండే చెన్నూరి నిహారిక ఇంటర్ చదువుతోంది. తండ్రి చదువుకోమని మందలించడంతో రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది.
తండ్రి చదువుకోమన్నాడని... ఆత్మహత్య చేసుకుంది - బాలిక ఆత్మహత్య వార్తలు
తండ్రి చదువుకోమని మందలించాడని... ఓ ఇంటర్ విద్యార్థిని ఇంటి నుంచి వెళ్లిపోయి శవమై తేలింది. ఈ ఘటన రామగిరి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
తండ్రి చదువుకోమన్నాడని... ఆత్మహత్య చేసుకుంది
ఎక్కడ వెతికినా లాభం లేకపోవడంతో... కుటుంబసభ్యులు ఈనెల 15న రామగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గురువారం నిహారిక మృతదేహాన్ని బావిలో గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. బావి నుంచి మృతదేహాన్ని వెలికి తీసి శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి:ఫంక్షన్‌కు తీసుకెళ్లలేదని యువతి ఆత్మహత్య