తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బాలిక కిడ్నాప్ కలకలం.. పోలీసుల దర్యాప్తు ముమ్మరం - Ap crime news

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం నియోజవర్గంలోని అయినవిల్లి మండల పరిధిలో 13 ఏళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

girl-kidnaped-in-eastgodavari-district in AP
బాలిక కిడ్నాప్ కలకలం...పోలీసుల దర్యాప్తు ముమ్మరం

By

Published : Dec 14, 2020, 10:28 PM IST

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలోని అయినవిల్లి మండలం శానపల్లి లంక గ్రామంలో 13 ఏళ్ల బాలిక అపహరణకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు బాలికను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.

కారులో వచ్చారు...

బాలిక తల్లిదండ్రుల మధ్య గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఈ పరిణామాలతో బాలిక తల్లి వద్ద కాకుండా.. శానపల్లి లంకలో తండ్రి వద్ద ఉంటుందని స్థానికులంటున్నారు. ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలిక రహదారిపై నడిచి వెళ్తుండగా.. కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు బాలికను కిడ్నాప్ చేశారు.

ఇదీ చూడండి:ఈనెల 17తో ముగియనున్న టీఎస్​పీఎస్​సీ ఛైర్మన్​ పదవీకాలం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details