బాలికపై ఏడాదిగా అత్యాచారానికి పాల్పడిన నిందితున్ని కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక తల్లి ప్రోద్బలంతోనే అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. భర్త చనిపోగా... రాంబాబు అనే వ్యక్తితో బాలిక తల్లి వివాహేతర సంబంధంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ చిన్నారిని బెదిరించి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనకు కారణమైన బాలిక తల్లి, నిందితుడు రాంబాబు, వారికి సహకరించిన మరో మహిళను కంచికచర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.