ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తున్న చిన్నారిని కన్నవారి ముందే మృత్యువు కబళించింది. ఎడ్ల బండి కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం 9వ మైలు తండాలో జరిగింది.
చిన్నారిని చిదిమేసిన ఎడ్లబండి... - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేర వార్తలు
రోజంతా పొలంలో ఆడుతూ పాడుతూ గడిపిన చిన్నారికి ఎడ్లబండి రూపంలో మృత్యువు ఎదురైంది. కన్నవారి ముందే బాలికని బండి చక్రం చిదిమేసింది. అప్పటిదాకా నవ్వుతూ కేరింతలు కొడుతున్న తమ కూతురు విగత జీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
చిన్నారిని చిదిమేసిన ఎడ్లబండి...
భూక్య మధు, మంజులకు ఇద్దరు కుమార్తెలు. పొలానికి వెళ్లి ఎడ్ల బండి మీద వస్తుండగా ప్రమాదవశాత్తు వారి పెద్దకుమార్తె ధరణి బండి చక్రం కింద పడింది. ఈ ఘటనలో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న పాప విగత జీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఇదీ చదవండి:పిల్లర్ కారణంగా బాలుడు మృతి