తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ప్రేమించివాడు పెళ్లాడలేదని.. యువతి ఆత్మహత్య - girl suicide in patancheru mandal

ప్రేమించిన వాడు పెళ్లి చేసుకోనన్నాడని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం లక్దారం గ్రామంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

girl committed suicide in sangareddy district
లక్దారం గ్రామంలో యువతి ఆత్మహత్య

By

Published : Jan 11, 2021, 7:20 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం లక్దారం గ్రామానికి చెందిన శ్రావణి పక్కింట్లో ఉన్న వెంకట్​రామిరెడ్డిని ప్రేమించింది. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు తమ కూతుర్ని పెళ్లి చేసుకోవాలని వెంకట్రామిరెడ్డిని కోరగా అతను తిరస్కరించాడు. తమ కుమార్తె వెంట పడొద్దని శ్రావణి కుటుంబ సభ్యులు ఆ యువకుణ్ని హెచ్చరించారు.

పెళ్లి చేసుకోనని చెప్పిన వెంకట్రామిరెడ్డి మళ్లీ తన కుమార్తె వెంటపడటం చూసిన యువతి తల్లి అతణ్ని మరోసారి మందలించింది. ప్రేమించినవాడు పెళ్లి చేసుకోవడం లేదని మనస్తాపం చెందిన శ్రావణి సోమవారం రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని యువకునిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details