బెల్లం వ్యాపారికి అధికారులు రూ.లక్ష జరిమానా విధించిన ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో చోటుచేసుకుంది. హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మణెమ్మ ట్రేడర్స్‌లో ఈనెల 2న తనిఖీలు చేపట్టారు. బెల్లం నిల్వలు పట్టుబడగా... ఆబ్కారీ సీఐ దుర్గాభవాని కేసు నమోదు చేశారు. సదరు వ్యాపారి సాయిప్రసాద్‌ను గతంలోనే బెల్లంను విక్రయించకూడదంటూ... తహసీల్దార్ బావుసింగ్ ఎదుట బైండోవర్ చేశారు.
బెల్లం వ్యాపారికి రూ.లక్ష జరిమానా - హుజూరాబాద్ లో బెల్లం పట్టివేత
బెల్లం వ్యాపారికి అధికారులు రూ.లక్ష జరిమానా విధించిన ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో చోటుచేసుకుంది. గుడుంబా తయారీదారులకు బెల్లం, పటికను విక్రయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ స్పష్టంచేశారు.
![బెల్లం వ్యాపారికి రూ.లక్ష జరిమానా బెల్లం వ్యాపారికి రూ. లక్ష జరిమానా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8768675-75-8768675-1599840131262.jpg)
బెల్లం వ్యాపారికి రూ. లక్ష జరిమానా
తిరిగి బెల్లం నిల్వలతో పట్టుబడటం వల్ల ఆబ్కారీ పోలీసులు కేసు నమోదు చేశారు. బైండోవర్ చేసినప్పటికీ తిరిగి నేరం చేసినందుకు.. హుజూరాబాద్ తహసీల్దార్ రూ. లక్ష జరిమానా విధిస్తూ ఈనెల 4న నోటీసు అందించారు. శుక్రవారం రూ. లక్ష చలానా రూపంలో చెల్లించాడు సదరు వ్యాపారి. చలానా రశీదును సీఐకి అందించారు. గుడుంబా తయారీదారులకు బెల్లం, పటికను విక్రయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ స్పష్టంచేశారు.