తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

జీహెచ్​ఎంసీ ఉద్యోగి అనుమానాస్పద మృతి... - హైదరాబాద్ లేటెస్ట్ న్యూస్

జీహెచ్​ఎంసీ ఉద్యోగి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన సికింద్రాబాద్​ జవహర్ నగర్​ పోలీస్​ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మృతదేహాన్ని జవహర్ నగర్ డంపింగ్ యార్డులో గుర్తించారు. మృతుని శరీరంపై కత్తితో పొడిచిన గాయాలను పోలీసులు గుర్తించారు.

ghmc employee suspected death at jawahar nagar in hyderabad
జీహెచ్​ఎంసీ ఉద్యోగి అనుమానాస్పద మృతి...

By

Published : Nov 23, 2020, 12:04 PM IST

సికింద్రాబాద్​లో జీహెచ్ఎంసీ ఉద్యోగి అనుమానాస్పదంగా మృతి చెందారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న రంగారెడ్డి అనే వ్యక్తి జూబ్లిహిల్స్​లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం నుంచి కనిపించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. సోమవారం తెల్లవారు జామున జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో రంగారెడ్డి మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో... పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లారు. మృతుని శరీరంపై కత్తితో పొడిచిన గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్​కు సమాచారం అందించారు. ఇది ప్రమాదమా? హత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు జవహర్​నగర్ పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:వరంగల్​లో ఆటో డ్రైవర్ దారుణ హత్య...

ABOUT THE AUTHOR

...view details