తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

సంగారెడ్డి ఎస్పీకి గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఫిర్యాదు - complaint on social media

గీతం యూనివర్సిటీపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీకి ఆ విశ్వవిద్యాలయ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. గీతం విశ్వవిద్యాలయంపై నిర్లక్ష్యపు, నిరాధార వార్తలను ప్రచారం చేయడం వెనక దురుద్దేశాలను ప్రజలు, విద్యావంతులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంగారెడ్డి ఎస్పీకి గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఫిర్యాదు
సంగారెడ్డి ఎస్పీకి గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఫిర్యాదు

By

Published : Oct 6, 2020, 5:36 PM IST

గీతంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ యూనివర్సిటీ యాజమాన్యం సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్​ రెడ్డికి ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ శివారు సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామ పరిధిలో ఉన్న గీతం విశ్వవిద్యాలయంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని... అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ శివప్రసాద్ తెలిపారు.

ఇలాంటి వాటి వల్ల తమ విశ్వవిద్యాలయ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందన్నారు. విద్యార్థులను వారి తల్లిదండ్రులను అయోమయానికి గురి చేస్తుందని తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. గీతం విశ్వవిద్యాలయంపై నిర్లక్ష్యపు, నిరాధార వార్తలను ప్రచారం చేయడం వెనక దురుద్దేశాలను ప్రజలు, విద్యావంతులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2017లోనే గీతంకు డీమ్డ్ విశ్వవిద్యాలయంగా న్యాక్​ గుర్తింపు ఇచ్చిందని వివరించారు.

ఇదీ చూడండి: ఇంటి ముందు పెట్టిన బైకు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు

ABOUT THE AUTHOR

...view details