తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

28 కిలోల గంజాయి స్వాధీనం: ఇద్దరు అరెస్ట్​ - GRP POLICE PRESS MEET

రాజస్థాన్​కు అక్రమంగా తరలిస్తున్న 28 కిలోల గంజాయిని  కాజీపేట రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్​కు చెందిన ఇద్దరు యువకులను అరెస్ట్​ చేశారు.

28 కిలోల గంజాయి స్వాధీనం

By

Published : Apr 25, 2019, 11:14 PM IST

అనకాపల్లి నుంచి రాజస్థాన్​కు అక్రమంగా తరలిస్తున్న 28 కిలోల గంజాయిని కాజీపేట్ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్​కి చెందిన సన్వర్ లాల్, బిలాల్ అనే ఇద్దరు యువకులు ఈ గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉదయం 10:30 గంటలకు కోణార్క్ ఎక్స్​ప్రెస్​ నుంచి గంజాయి బ్యాగులతో దిగిన యువకులు రాజస్థాన్ వెళ్లడానికి మరో రైలు కోసం ప్లాట్ ఫామ్​పై వేచి ఉండాగా పోలీసులు వారిని తనిఖీ చేశారు. 14 కట్టల్లో 28 కిలోల గంజాయి దొరికినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుల న్యాయస్థానంలో హాజరుపరిచారు.

28 కిలోల గంజాయి స్వాధీనం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details