భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని బ్రిడ్జి సెంటర్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు భారీ స్థాయిలో గంజాయిని పట్టుకున్నారు. ఏపీలోని చిత్తూరు జిల్లా నుంచి ఆగ్రాకు లారీలో రవాణా చేస్తున్న 563 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు భద్రాచలం ఏఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు.
భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు - etv bharat
ఏపీలోని చిత్తూరు జిల్లా నుంచి ఆగ్రాకు తరలిస్తున్న గంజాయిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని బ్రిడ్జి సెంటర్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 563 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
![భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9261335-3-9261335-1603291791594.jpg)
భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు
సఫారీ కారులో 27 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు చెప్పారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశామన్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 88, 50, 000 రూపాయలు ఉంటుందన్నారు.
ఇవీ చూడండి: హెచ్చరిక.. రాగల 24 గంటలు అప్రమత్తత అవసరం