గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్టు - జూబ్లీహిల్స్ గంజాయి రవాణా
![గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్టు గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్టు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9283368-31-9283368-1603451787032.jpg)
14:28 October 23
జూబ్లీహిల్స్‌లో గంజాయి పట్టివేత
నిషేధిత గుట్కా, గంజాయిని తరలిస్తున్న ఓ ముఠాను హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. సిద్దిపేట జిల్లాకు చెందిన కల్యాణ్, అబ్రార్ హుస్సేన్, చేతన్, బంజారా హిల్స్‌కు చెందిన రమేశ్, శ్యాంసుందర్ రెడ్డిలు ముఠాగా ఏర్పడి... గంజాయిని సరఫరా చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో వీరి నివాసంపై దాడులు నిర్వహించిన పోలీసులు... గంజాయి నిల్వలను గుర్తించారు. విశాఖపట్నం, ఒడిశా రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి నగరంలో విక్రయాలు జరుపుతున్నట్లు తేల్చారు. వీరిలో ఇద్దరిని అప్పటికే అరెస్టు చేయగా... ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు విక్రయించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:రాష్ట్ర ఖజానా కళకళ.. పుంజుకుంటోన్న ఆర్థిక వ్యవస్థ