నిజామాబాద్ జిల్లా ఎడపల్లికి చెందిన ఓ మహిళ తన అక్కకు రోడ్డు ప్రమాదం జరగటంతో నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చింది. రైల్వే స్టేషన్ వైపు వచ్చిన ఆ మహిళను చూసిన విక్కీ అనే యువకుడు.. ఆస్పత్రి అవసరాలకు డబ్బులు ఇస్తానని నమ్మబలికాడు. కలెక్టరేట్ వైపు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
మహిళపై ఐదుగురు యువకుల అత్యాచారం - gang rape in nizamabad
ఓ మహిళపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన నిజామాబాద్‌లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొంత మంది నిందితులను అరెస్ట్ చేశారు.

మహిళపై ఐదుగురు యువకుల అత్యాచారం
అంతకుముందే తన స్నేహితులకు విక్కీ ఫోన్ చేయటంతో వారు వచ్చారు. 11 మంది మిత్రులు అక్కడికి రాగా అందులో ఐదుగురు ఆ మహిళను అత్యాచారం చేశారు. అదే సమయంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం రావటంతో యువకులు పరారయ్యారు. కొంతమందిని పోలీసులు పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.