తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నగ్నచిత్రాలతో బెదిరించి.. బాలికపై సామూహిక అత్యాచారం - హైదరాబాద్​లో మైనర్​ బాలికపై గ్యాంగ్​ రేప్

ప్రేమ పేరుతో మైనర్ బాలికను వలలో వేసుకుని ఆమె నగ్నచిత్రాలు సేకరించాడు. వాటిని అడ్డం పెట్టుకుని స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అనారోగ్యానికి గురైన బాలికను ఏమైందని కుటుంబ సభ్యులడగగా.. ఆమె చెప్పిన విషయం విని వారు విస్తుపోయారు. సదరు యువకునిపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన హైదరాబాద్​ చిలకలగూడ పీఎస్​ పరిధిలో చోటు చేసుకుంది.

gang rape on minor girl in Hyderabad
నగ్నచిత్రాలతో బెదిరించి.. బాలికపై సామూహిక అత్యాచారం

By

Published : Aug 27, 2020, 1:19 PM IST

హైదరాబాద్​ మహమూద్​గూడకు చెందిన బాలిక(14), సీతాఫల్​మండి బీదలబస్తీకి చెందిన శివకుమార్​(23) అనే వ్యక్తిి కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. లాంగ్​డ్రైవ్​ పేరుతో బాలికను అనేకసార్లు బయటకు తీసుకెళ్లిన శివకుమార్​ ఆమె నగ్నచిత్రాలను తన మొబైల్​ఫోన్​లో చిత్రీకరించాడు. వాటిని అడ్డం పెట్టుకుని ఏడాదిగా ఆమెను వేధిస్తున్నాడు.

వారం రోజుల క్రితం శివకుమార్​ తను చెప్పిన చోటుకు వస్తే నగ్నచిత్రాలు డిలీట్​ చేస్తానని నమ్మించాడు. ఆ మాటలు నమ్మిన బాలిక ఓయూ పరిధిలోని ఓ పాత భవనానికి వెళ్లింది. అక్కడ శివకుమార్​ అతని ముగ్గురు స్నేహితులు ఆమెను బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దారుణాన్ని సెల్​ఫోన్​లో చిత్రీకరించారు. ఎవరికైనా ఈ విషయం చెబితే వీడియోలో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తామని బెదిరించారు.

వారి బెదిరింపులకు భయపడిన బాలిక గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి వెళ్లింది. తర్వాత రోజు అనారోగ్యానికి గురికావడం వల్ల ఏం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరా తీశారు. సదరు బాలిక విషయాన్నంతా తల్లిదండ్రులకు చెప్పగా రెండ్రోజుల క్రితం వారు చిలకలగూడ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు మైనర్లు కావడం వల్ల వారిని జువైనల్ హోంకు తరలించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details