తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పెద్దపల్లిలో ఒడిశా కార్మికురాలిపై సామూహిక అత్యాచారం..! - ఒరిస్సా పోలీసులు

బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఓ ఇటుక బట్టీ కార్మికురాలిపై.. నిర్వాహకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారన్న ఫిర్యాదుపై దర్యాప్తు మొదలైంది. బాధితురాలి సొంత రాష్ట్రమైన ఒడిశా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి నుంచి వచ్చిన సమాచారంతో పెద్దపల్లి పోలీసులు రంగంలోకి దిగారు.

gang rape on a migrant worker in peddapalli
వలస కార్మికురాలిపై సామూహిక అత్యాచారం

By

Published : Feb 9, 2021, 7:50 PM IST

పనిచేసే ప్రదేశంలో ఓ మహిళపై నిర్వాహకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారంటూ తోటి కార్మికులు.. ఇటుక బట్టీ ఎదుట ఆందోళన చేపట్టారు. బాధితురాలి సొంత రాష్ట్రమైన ఒడిశా నుంచి.. పెద్దపల్లి పోలీసులకు అందిన ఫిర్యాదుతో ఘటన వెలుగులోకొచ్చింది. ఘటన అనంతరం బాధితురాలు ఒడిశా పోలీసులకు ఫోన్​లో ఫిర్యాదు చేసి.. తన భర్తతో కలిసి ఆ ప్రదేశం నుంచి వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఒడిశా పోలీసుల నుంచి సమాచారం అందుకున్న పెద్దపల్లి పోలీసులు.. రెవెన్యూ సిబ్బందితో కలిసి.. ఘటన స్థలాన్ని పరిశీలించారు. కార్మికుల వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. బాధితురాలి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

నిర్వాహకులు తమపై తరచు వేధింపులకు పాల్పడుతున్నారని.. కార్మికులు అధికారులతో మొర పెట్టుకున్నారు. తమను.. ఒడిశాకు పంపించాలంటూ వేడుకున్నారు. మరికొంత మంది తమకు తాముగా అక్కడినుంచి తరలి వెళ్లిపోయారు.

ఇదీ చదవండి:బొల్లారం హత్య కేసు: భార్య, బావమరిదే చంపేశారు!

ABOUT THE AUTHOR

...view details