ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగలను సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కొంత కాలంగా అక్కడక్కడా దొంగతనాలకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని తొగుట సీఐ రవిందర్ వెల్లడించారు. తొగుట, దౌల్తాబాద్, గజ్వేల్ మండలాల్లోని ఆలయాలలో తాళం వేసిన ఇళ్లు టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు.
ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు - thiefs arrest news
ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగలను సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కొంత కాలంగా అక్కడక్కడా దొంగతనాలకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు
దౌల్తాబాద్ మండల కేంద్రంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద పట్టుబడ్డారని, వారిని విచారించగా మరింత సమాచారం దొరికినట్టు సీఐ వివరించారు. వీరి నుంచి సుమారు ఆరున్నర తులాల బంగారం, 1.3 కిలోల వెండితో పాటు కొన్ని మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన కానిస్టేబుల్ రమేశ్ కు సీఐ రివార్డు అందజేశారు.