తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడిన గాంధీనగర్​ ఎస్సై - గాంధీనగర్​లో ఏసీబీ తనిఖీలు

కేసు విచారణ నిమిత్తం డిమాండ్​ చేసిన రూ. 30 వేల నగదును ఎస్సై తీసుకుంటుండగా.. హైదరాబాద్​ అనిశా అధికారులు పట్టుకున్న ఘటన హైదరాబాద్​ గాంధీనగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగింది.

gandhi nagar si caught by hyderabd acb officers
లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడిన గాంధీనగర్​ ఎస్సై

By

Published : Oct 28, 2020, 6:27 PM IST

హైదరాబాద్​ గాంధీనగర్​ పోలీస్​స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న సబ్​ ఇన్​స్పెక్టర్​ లక్ష్మీనారాయణను అనిశా అధికారులు అరెస్ట్​ చేశారు. స్టేషన్​లోని కేసు నెంబర్ 240/20లో నిందితుడిగా ఉన్న ఎం. సంతోష్​రెడ్డి.. నకిలీ సర్టిఫికేట్​ తయారు చేస్తూ ఇటీవల జైలుకు వెళ్లి బెయిల్​పై విడుదలయ్యారు.

కేసు విచారణ నిమిత్తం సాయం చేసేందుకు ఎస్సై లక్ష్మీనారాయణ రూ. 30 వేలు డిమాండ్​ చేశారు. ఈ మేరకు నిందితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పక్కా వ్యూహంతో డబ్బులు తీసుకుంటున్న సమయంలో ఎస్సై లక్ష్మీనారాయణతో పాటు అతనికి సహాయపడిన కానిస్టేబుల్​ నరేష్​ను అనిశా అధికారులు అరెస్ట్​ చేశారు.

ఇదీ చదవండిఃపోలీసు స్టేషన్ నుంచి పరారైన దొంగ

ABOUT THE AUTHOR

...view details