తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

జీతాలు చెల్లించడం లేదని 'గాంధీ'లో ఉద్యోగి ఆత్మహత్యాయత్నం - గాంధీ ఆస్పత్రి

గాంధీ ఆస్పత్రి యాజమాన్యం జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక హరిబాబు అనే ఉద్యోగి ఆస్పత్రిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జీతాలు చెల్లించాలని అభ్యర్థించినా పట్టించుకోలేదని హరిబాబు వాపోయాడు. ఇల్లు గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.

gandhi hospital employee attempted suicide
జీతాలు చెల్లించడం లేదని 'గాంధీ'లో ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

By

Published : Nov 24, 2020, 7:48 PM IST

గాంధీ ఆస్పత్రిలో పొరుగు సేవల విభాగానికి చెందిన హరిబాబు అనే ఉద్యోగి.. ఆస్పత్రిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గత కొన్ని నెలలుగా జీతాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఈ చర్యకి పాల్పడినట్లు అతను తెలిపాడు.

244 మంది రోగులకి సంరక్షణగా హరిబాబును ఆస్పత్రి యాజమాన్యం ఉద్యోగంలో తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రతి నెల జీతాలు వెయ్యకుండా ఎస్​ఎస్​వీ క్రియేషన్ కాంట్రాక్టర్ చాలా ఆలస్యంగా జీతాలు వేస్తున్నట్లు హరిబాబు తెలిపాడు. ఏజిల్ గ్రూప్ సమయానికి జీతాలు వెయ్యడం లేదని ఆరోపించాడు. సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లినా కూడా పట్టించుకోలేదని హరిబాబు వెల్లడించాడు. సమయానికి జీతాలు రాకపోవడంతో ఇల్లు గడవక నిప్పంటించుకున్నానని వాపోయాడు. బాధితుడికి ఈ ఘటనలో పది శాతం గాయాలయ్యాయి. కాగా గాంధీలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

జీతాలు చెల్లించడం లేదని 'గాంధీ'లో ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

ఇదీ చదవండి:దొంగలతో పోలీసుల డీల్​... దోచుకున్న సొమ్ములో వాటా

ABOUT THE AUTHOR

...view details