కరీంనగర్లోని విద్యుత్ సూపరింటెండెంట్ కార్యాలయ ఆవరణలోని స్టోర్లో మంటలు చెలరేగాయి. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. స్టోర్ పై నుంచి హైటెన్షన్ వైర్లు వెళ్తున్నాయి. వైర్లకు కాకి తగిలి చనిపోయి స్టోర్ చెత్తలో పడిపోయి మంటలు వచ్చినట్లు ఎస్ఈ మాధవరావు తెలిపారు.
విద్యుత్ సూపరింటెండెంట్ కార్యాలయ ఆవరణలో మంటలు - karimnagar city news
విద్యుత్ సూపరింటెండెంట్ కార్యాలయ ఆవరణలో మంటలు చెలరేగిన ఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
విద్యుత్ సూపరింటెండెంట్ కార్యాలయ ఆవరణలో మంటలు
ఘటనా స్థలిని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ శశాంక, పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి, మేయర్ సునీల్ రావు పరిశీలించారు. రూ. 7 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు ఎస్ఈ మాధవరావు చెప్పారు.