కొనుగోలు చేసిన పండ్లకు డబ్బులు ఇవ్వమని అడిగినందుకు... పండ్ల వ్యాపారిని వినియోగదారుడు హత్య చేసిన ఘటన కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ బరేలికి చెందిన శాకీబ్ అలీ(30) కూకట్పల్లి నుంచి ప్రగతి నగర్‌కు వెళ్ళే దారిలో తోపుడు బండిపై పండ్లను విక్రయించేవాడు.
పండ్లు కొన్నాడు.. పైసలు అడిగితే చంపేశాడు! - తెలంగాణ వార్తలు
కొనుగోలు చేసిన పండ్లకు డబ్బులు ఇవ్వమని అడిగినందుకు... పండ్ల వ్యాపారిని వినియోగదారుడు హత్య చేసిన ఘటన కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతుని సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ నెల 1న గుర్తు తెలియని వ్యక్తి పండ్లను కొనుగోలు చేసేందుకు శాకీబ్ అలీ తోపుడు బండి వద్దకు వచ్చాడు. పైనాపిల్, ద్రాక్షపండ్లను కొనుగోలు చేశాడు. ద్రాక్ష పండ్లకు డబ్బులు ఇవ్వటానికి అతడు నిరాకరించటంతో పండ్ల వ్యాపారి నిలదీసాడు. దాంతో ఆ వినియోగదారుడు మరో ముగ్గురికి ఫోన్ చేసి పిలిపించి... దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాలపాలైన శాకీబ్ అలీని అతని తమ్ముడు ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ 3వ తేదిన మరణించాడు. మృతుడి సోదరుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:అడవి బిడ్డల ఆకలి తీర్చిన అన్నం సేవా ఫౌండేషన్