తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

చావులోనూ విడదీయని స్నేహం.. ఒకేరోజు ఇద్దరు మిత్రుల దుర్మరణం - జగిత్యాల జిల్లా వార్తలు

అన్ని బంధాల్లోకెల్లా స్నేహబంధం విడదీయరానిది. చిన్న చిన్న అభిప్రాయ బేధాలొచ్చినా.. క్షణాల్లో అన్ని మరిచిపోయి కలిసిపోయే బంధం ఏదైనా ఉంటే.. అది స్నేహం మాత్రమే. మిత్రులకు ఏదైనా ఆపద వచ్చిందంటే.. ఏమీ ఆలోచించకుండా వారి పక్కన ఉండాలన్న ఆరాటమే స్నేహాన్ని అన్ని బంధాల్లోకెల్ల ఉన్నతంగా నిలిపింది. అందుకేనేమో.. జగిత్యాల జిల్లాలో ఇద్దరు ప్రాణ మిత్రులు ఒకేరోజు చనిపోయారు. కారణాలు వేరైనా.. ఒకరు లేకపోతే మరొకరు ఉండలేమని చెప్పకనే చెప్పారు. ఆ స్నేహితుల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Friends Die  Same day  With Different Issues In Jagtial District
స్నేహితులిద్దరూ ఒకేరోజు చనిపోయారు!

By

Published : Sep 12, 2020, 10:53 AM IST

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన గుర్రం భాస్కర్​ క్యాన్సర్​ చికిత్స పొందుతుండగా.. కరోనా వైరస్​ సోకింది. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించింది. వైద్యులు భాస్కర్​ని ఇంటికి తీసుకువెళ్లమని సలహా ఇచ్చారు. ఆస్పత్రి నుంచి ఇంటికి తెచ్చిన రోజేే భాస్కర్​ ప్రాణాలు విడిచాడు. అదేరోజు.. భాస్కర్​ స్నేహితుడు గుర్రం రాజేందర్ పొలంలో పని చేస్తుండగా​ విద్యుత్​ షాక్​ తగిలి చనిపోయాడు. కష్టపడి పని చేసుకుంటూ.. కలిసి మెలిసి ఉండే ఇద్దరు ప్రాణ మిత్రులు ఒకేరోజు చనిపోగా.. చావులోనూ వారిది విడదీయలేని స్నేహమే అంటూ తోటి యువకులు, గ్రామస్థులు కన్నీరు పెట్టుకున్నారు. యువకులిద్దరూ ఒకేరోజు చనిపోవడం వల్ల నేరెళ్ల గ్రామం కన్నీటి సంద్రమైంది.

ABOUT THE AUTHOR

...view details