తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఓటీపీ, ఓఎల్​ఎక్స్​ పేరుతో వల.. రూ.8.70 లక్షలు స్వాహా - హైదరాబాద్​లో సైబర్​ మోసం వార్తలు

సైబర్​ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుంటూ దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓటీపీ, ఓఎల్​ఎక్స్​ పేరుతో ఇద్దరిని బురిడీ కొట్టించిన కేటుగాళ్లు.. రూ.8.70 లక్షలు కాజేశారు.

fraudsters-use-fake-news-to-fraud-in-hyderabad
ఓటీపీ, ఓఎల్​ఎక్స్​ పేరుతో వల.. రూ.8.70 లక్షలు స్వాహా

By

Published : Jul 27, 2020, 10:45 PM IST

సైబర్​ నేరగాళ్లు రోజుకో రీతిలో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. వీరి ఉచ్చులో చిక్కుకుని, డబ్బులు పోగొట్టుకుంటున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్​ చిక్కడపల్లికి చెందిన ఓ మహిళకు ఓటీపీ పంపంచి.. ఖాతా నుంచి రూ.5 లక్షలు స్వాహా చేశారు కేటుగాళ్లు. ఓఎల్​ఎక్స్​ పేరుతో మరో వ్యక్తి వద్ద రూ.3.70 లక్షలు కాజేశారు.

మోసపోయినట్లు గుర్తించిన బాధితులు సైబర్​క్రైమ్​ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచూడండి: ఓ కట్టు కథ అల్లారు... రూ.1.45లక్షలు దోచారు

ABOUT THE AUTHOR

...view details