తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో మోసం.. ఒకరు అరెస్ట్​

హైదరాబాద్​కు చెందిన యార్లగడ్డ ప్రదీప్.. ఓ ప్రైవేట్ కంపెనీ​లో రూ. 7 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాడు. మదుపరుల పెట్టుబడులను ఆ సంస్థకు చెందిన డైరెక్టర్లు తమ సొంత ఖాతాలకు మళ్లించుకున్నారు. ప్రదీప్ రెండేళ్ల తర్వాత లాభాల కోసం ఆరా తీయగా ఆ సంస్థ మోసం బయటపడింది. బెంగళూర్, ముంబయిలోని సంస్థ కార్యాలయాల బోర్డులను తిప్పేశారు. బాధితుడు ఆగస్టు నెలలో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. తాజాగా ఒకరిని అరెస్ట్​ చేశారు.

By

Published : Oct 29, 2020, 10:48 PM IST

స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో మోసం చేసిన ప్రశాంత్ ప్రభు అనే వ్యక్తిని తాజాగా హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఇది వరకే రాజ్​దీప్, మనోజ్ జవేరి, అనిల్​ను అరెస్ట్ చేశారు. నిందితులు ఎంత మేర మోసం చేశారనే దానిపై సీసీఎస్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

ఏం జరిగింది:

బెంగళూర్​కు చెందిన ప్రశాంత్ ప్రభు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే సంస్థలో డైరెక్టర్​గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్​కు చెందిన యార్లగడ్డ ప్రదీప్.. మనోజ్ జవేరి స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్​లో రూ. 7 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాడు. సెబీ నిబంధనలు ఉల్లంఘిస్తూ మనోజ్ జవేరి సంస్థకు చెందిన డైరెక్టర్లు.. మదుపరుల పెట్టుబడులను సొంత ఖాతాలకు మళ్లించుకున్నారు.

యార్లగడ్డ ప్రదీప్ రెండేళ్ల కాలంలో పెట్టుబడులు పెట్టి.. ఆ తర్వాత లాభాల కోసం ఆరా తీయగా మనోజ్ జవేరి సంస్థ మోసం బయటపడింది. బెంగళూర్, ముంబయిలోని సంస్థ కార్యాలయాల బోర్డులను తిప్పేశారు. బాధితుడు యార్లగడ్డ ప్రదీప్ ఆగస్టు నెలలో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మనోజ్ జవేరి స్టాక్ బ్రోకింగ్ కంపెనీ డైరెక్టర్లు కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్​తో పాటు తెలంగాణలో దాదాపు 300 మందిని మోసం చేసినట్లు సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది. బెంగళూర్​లో ఉన్న ప్రశాంత్ ప్రభును సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చూడండి: ధరణి.. భారతదేశానికే ట్రెండ్ సెట్టర్: సీఎం కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details