ఏపీ చిత్తూరులోని దుర్గానగర్ కాలనీకి చెందిన సందీప్ కిషోర్.. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. తన పేరుమీద ఉన్న పలు పాలసీలను 2018, 2014లో రెన్యూవల్ చేయాల్సి ఉండగా చేయలేదు. ఆ తరువాత గుర్తుతెలియని వ్యక్తులు అతని పాలసీలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. కిషోర్‌కు ఫోన్ చేసి ఆర్బీఐ నుంచి మాట్లాడుతున్నామని చెప్పి పాలసీల గురించి మాట్లాడారు. కొంత రుసుము చెల్లిస్తే మీకు రావాల్సిన నగదు తిరిగి వస్తుందని నమ్మించారు.
ఇన్సూరెన్స్ పేరుతో రూ.16.50 లక్షలు స్వాహా - చిత్తూరులో ఇన్సూరెస్ పేరుతో మోసం
ఓ వ్యక్తిని ఇన్సూరెన్స్ రూ.35 లక్షలు వస్తుందని నమ్మించిన గుర్తుతెలియని వ్యక్తులు రూ.16.50లక్షలు దోచుకున్నారు. చివరకు మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు చిత్తూరు రెండో పట్టణ పోలీసులను ఫిర్యాదు చేయడం వల్ల ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
![ఇన్సూరెన్స్ పేరుతో రూ.16.50 లక్షలు స్వాహా ఇన్సూరెన్స్ పేరుతో రూ.16.50 లక్షలు స్వాహా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10057882-99-10057882-1609321004265.jpg)
వాళ్ల మాటలు నమ్మిన కిషోర్ మొదట్లో రూ.60 వేలు చెల్లించారు. తరువాత ఇన్సూరెన్స్‌కు సంబంధించిన నగదు రూ.35 లక్షలు వస్తుందని.. దీనికి కొంత రుసుముతో పాటు వివిధ పన్నులు చెల్లించాలని ఫోన్ ద్వారా అతడిని నమ్మించారు. కొంత నగదు చెల్లిస్తూ వచ్చారు. ఇలా నాలుగేళ్లలో 36 దఫాలుగా రూ.16.50 లక్షలు బాధితుడు చెల్లించినట్లు తెలిపారు. చివరకు మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు.. రెండో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ యుగంధర్ వివరించారు.
ఇదీ చూడండి:మెట్రో స్టేషన్ పైనుంచి దూకిన యువకుడు