తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పసికందుని ఈడ్చుకెళ్లిన నక్క! - భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పసికందుని ఈడ్చుకెళ్లిన నక్క

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ గ్రామీణ పరిధిలో ఊయలలో ఆదమరిచి నిద్రిస్తున్న ఓ పసికందుని నక్క ఈడ్చుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాబుని ఈడ్చుకెళ్తున్న సమయంలో తల్లిదండ్రులు అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది. వెంటనే చిన్నారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్సానంతరం బాబు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

fox dragged the baby boy in palvancha
పసికందుని ఈడ్చుకెళ్లిన నక్క!

By

Published : Nov 19, 2020, 8:13 AM IST

Updated : Nov 19, 2020, 8:32 AM IST

అటవీ ప్రాంతంలోని ఓ గొత్తికోయ పల్లెలో ఊయలలో నిద్రిస్తున్న మూడు నెలల బాలుడ్ని నక్క నోట కరుచుకుని ఈడ్చుకెళ్లింది. వెంటనే తల్లిదండ్రులు అప్రమత్తం కావడంతో విడిచిపెట్టింది. ఒకరోజు ఆలస్యంగా వెలుగుచూసిన ఈ హృదయ విదారక ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. పాల్వంచ మండల కేంద్రానికి సుమారు 40 కి.మీ. దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజన పల్లె రాళ్లచెలక. ఈ గ్రామానికి చెందిన ముక్తి యడమ, రాధ దంపతులకు మూడు నెలల మగబిడ్డ ఉన్నాడు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు చిన్నారిని పూరింటి వసారాలోని చీర ఉయ్యాలలో నిద్రపుచ్చిన తల్లిదండ్రులు లోపల పనిచేసుకుంటున్నారు.

బిడ్డ కేకలతో అప్రమత్తం

కొద్దిసేపటికి చెట్లపొదల్లోంచి వచ్చిన నక్క చిన్నారిపై దాడిచేసింది. గోళ్లతో బాగా రక్కింది. తల భాగాన్ని నోట కరుచుకుని సుమారు పది అడుగుల దూరం లాక్కెళ్లింది. బిడ్డ కేకలతో బయటకొచ్చిన తల్లిదండ్రులు నక్కను అదిలించారు. దీంతో అది పసికందును వదిలేసి పరారైంది. అప్పటికే గోళ్లతో రక్కడంతో బిడ్డ ముఖం, తల భాగంలో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే చిన్నారిని పాల్వంచ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెండు గంటల పాటు శ్రమించిన వైద్యులు తలకు గాయమైన చోట కుట్లు వేశారు. చిన్నారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని, రెండ్రోజుల్లో డిశ్ఛార్జి చేస్తామని వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి:ఇంజనీరింగ్ విద్యార్థిని హత్యకేసులో పోలీసుల చేతికి కీలక సమాచారం!

Last Updated : Nov 19, 2020, 8:32 AM IST

ABOUT THE AUTHOR

...view details