నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలుడు నాగేంద్ర అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బాలుడి గొంతుపై చేతి గుర్తులు ఉండటం వల్ల అతను నిద్రిస్తున్న సమయంలో ఎవరో గొంతు నులిమి హత్య చేసుంటారనే అనుమానం వ్యక్తమవుతోంది.
నాలుగేళ్ల బాలుడి అనుమానాస్పద మృతి.. తల్లేపైనే అనుమానం.. - Nizamabad district crime news
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తొర్తిలో విషాదం చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది.

తొర్తిలో నాలుగేళ్ల బాలుడి మృతి
కొంతకాలంగా నాగేంద్ర తల్లిదండ్రులు మనస్పర్థలతో వేర్వేరుగా ఉంటున్నారని బంధువులు తెలిపారు. తల్లి దగ్గర ఉంటున్న నాగేంద్ర తెల్లవారేసరికి విగతజీవిగా పడి ఉన్నాడు. రాత్రి తల్లే బాలుణ్ని హత్య చేసి ఉంటుందని బంధువులు ఆరోపించారు. పోలీసులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
- ఇదీ చూడండిఏన్కూరులో పేలుడు పదార్థాలు స్వాధీనం