స్నేహితుని పుట్టినరోజూ వేడుకల్లో వికృత చేష్టలకు పాల్పడిన నలుగురు యువకులు కటకటాల పాలయ్యారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ ప్రాంతంలోని జంగాలపల్లి గ్రామానికి చెందిన వెంకటసాయి అనే యువకుడు జన్మదినాన్ని మిత్రులతో కలిసి జరుపుకున్నాడు. ఈ వేడుకల్లో కత్తులతో విన్యాసాలు చేస్తూ వికృత చర్యలకు పాల్పడ్డారు. దీంతో నలుగురు యువకులను అరెస్ట్ చేసినట్లు పెద్దపల్లి డీసీపీ రవీందర్ తెలిపారు.
'వికృత చేష్టలకు పాల్పడితే కఠిన చర్యలు' - పెద్దపల్లి జిల్లా సమాచారం
సంతోషంగా జరుపుకోవాల్సిన జన్మదిన వేడుకల్లో కత్తులతో విన్యాసాలు చేశారు. స్నేహితుని పుట్టినరోజు వేడుకల్లో వికృత చర్యలకు పాల్పడ్డారు. దీంతో నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో సంఘటన జరిగింది.
'వికృత చేష్టలకు పాల్పడితే కఠిన చర్యలు'
పిల్లల విషయంలో తల్లిదండ్రులు పూర్తి బాధ్యత వహించాలని డీసీపీ తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే రౌడీషీట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. సమాజం పట్ల ప్రతిఒక్కరు బాధ్యతతో మెలగాలని లేనిపక్షంలో కఠినచర్యలు తీసుకుంటామని రవీందర్ వెల్లడించారు.