రుణ యాప్‌ల కేసులో మరో నలుగురి అరెస్ట్ - లోన్‌యాప్ అరెస్టులు
20:04 January 30
రుణ యాప్‌ల కేసులో మరో నలుగురి అరెస్ట్
ఆన్ లైన్ రుణాల కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన నిరంజన్, యశీ గ్యాస్టో, న్యిచక్, ఉషా అనే నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వాటర్ ఎలిఫెంట్ ఫైనాన్షియల్ లిమిటెడ్, బెడ్ వాలెట్ టెక్నాలజీస్ లిమిటెడ్ పేరుతో సంస్థలు స్థాపించి రుణ యాప్‌లు రూపొందించారు.
19 రుణ యాప్‌ల ద్వారా రుణాలు ఇచ్చి... అధిక వడ్డీ వసూలు చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నట్లు సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తులో తేలింది. 200 మంది టెలీకాలర్లను నియమించుకొని రోజు రుణగ్రహీతలను ఫోన్లలో వేధిస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ సంస్థల వెనక ఇద్దరు చైనీయులు ఉన్నట్లు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న ఇద్దరు చైనీయులకు సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి :గూగుల్ ప్లేస్టోర్ నుంచి 200 రుణ యాప్‌ల తొలగింపు