తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

హేమంత్​ హత్య కేసులో మరో నలుగురు అరెస్ట్​

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హేమంత్ పరువు హత్య కేసులో మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితులైన అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, మేనమామ యుగేందర్ రెడ్డిల కస్టడీ ముగియగా వారిని న్యాయమూర్తి ముందు హాజరు పరిచి చంచల్​గూడా జైలుకు తరలించారు. ఆరు రోజుల పాటు నిందితులను విచారించిన గచ్చిబౌలి పోలీసులు కీలక విషయాలను రాబట్టారు. హత్యకు పాల్పడ్డ ముఠా సభ్యులు బిచ్చు యాదవ్, ఎరుకల కృష్ణతోపాటు మరో ముగ్గురిని కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేయనున్నారు.

four more accused arrested in hamanth murder case in hyderabad
హేమంత్​ హత్య కేసులో మరో నలుగురు అరెస్ట్​

By

Published : Oct 6, 2020, 4:15 AM IST

హేమంత్ పరువు హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఆరు రోజుల పాటు నిందితులను విచారించిన గచ్చిబౌలి పోలీసులు కీలక విషయాలను రాబట్టారు. తమకు ప్రాణం కన్నా పరువే ముఖ్యమని చెప్పిన లక్ష్మారెడ్డి... కూతురు ప్రేమ పెళ్లి ఇష్టం లేకే హేమంత్​ను హత్య చేయించాలని భావించినట్లు పోలీసులకు తెలిపారు. అవంతి ప్రేమి విషయం తెలిసి కట్టడి చేసినా జూన్ 10న తమకు తెలియకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని వెల్లడించారు.

సీన్‌ రికన్‌స్ట్రక్ట్‌

పెళ్లి తర్వాత అవంతిని ఇంటికి రమ్మని బ్రతిమిలాడినా రాలేదని.. ఇదే విషయమై హేంమంత్​ ను బెదిరించినా ఫలితం లేక.. తన చెల్లి బాధను చూడలేక ఈ హత్యకు పాల్పడినట్లు యుగేంధర్ రెడ్డి వివరించాడు. హేమంత్‌ కిడ్నాప్‌ దగ్గరి నుంచి హత్యచేసి మృతదేహాన్ని పడేసిన ప్రాంతం వరకు పోలీసులు సీన్‌ రికన్‌స్ట్రక్ట్‌ చేశారు. లక్ష్మారెడ్డి, యుగేందర్ రెడ్డి కస్టడీ ముగియగా వారిని న్యాయమూర్తి ముందు హాజరు పరిచి చంచల్​గూడా జైలుకు తరలించారు.

అశీష్ రెడ్డికి ఎలాంటి ప్రమేయం లేదు

ఈ కేసులో మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవంతి సోదరుడు అశీష్ రెడ్డికి హత్యలో ఎలాంటి ప్రమేయం లేదని తేల్చారు. దీంతో పాటుగా హత్యకు పాల్పడ్డ ముఠా సభ్యులు బిచ్చు యాదవ్, ఎరుకల కృష్ణతో పాటు మరో ముగ్గురిని కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేయనున్నారు.

ఇదీ చదవండి:ఔటర్​రోడ్​పై వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం...

ABOUT THE AUTHOR

...view details